తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ టీజీ వెంకటేష్..!
కేసీఆర్ చైనా, పాకిస్థాన్ కన్నా దారుణంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.;
ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల యుద్ధంపై రాయలసీమ నేత, ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. కేసీఆర్ చైనా, పాకిస్థాన్ కన్నా దారుణంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కరోనాతో కేసీఆర్‌కు మతి మరుపు వచ్చిందన్నారు.. అందుకే చేసుకున్న ఒప్పందాలను మరచిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇక దీనికి న్యాయస్థానం ద్వారానే ముగింపు పడాలన్నారు.