Nagababu : లడ్డు వివాదం పై నాగబాబు రియాక్షన్

Update: 2024-09-21 14:30 GMT

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మెగాబ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం అన్నారు.

శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలన్న ఉద్దేశంతో జంతు కొవ్వును కలిపిన నెయ్యిని వాడటాన్ని క్షమించరాని నేరంగా నాగబాబు తెలిపారు. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారని ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News