Nagababu: కల్తీ సారా మరణాలపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
Nagababu: జంగారెడ్డి గూడెం మరణాలు, కల్తీసారాపై జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.;
Nagababu (tv5news.in)
Nagababu: జంగారెడ్డి గూడెం మరణాలు, కల్తీసారాపై జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీసారా వల్ల చనిపోలేదంటూ ప్రభుత్వం శాసన సభలో ప్రకటన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన. తాను స్వయంగా బాధితులను చూశానని.. వారి కుటుంబాలతో మాట్లాడానని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్తీ సారా తయారు చేసే వాళ్లను ఎందుకు సమర్ధింస్తుందని ప్రశ్నించారు. సహజంగానే అందరూ చనిపోయారనడం ఏమిటన్నారు. దీనిపై ఓ ఎన్వైరీ వేసి నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయాలని కోరారు. దీనితో పాటు మరణించిన వారికి ఎక్స్ గ్రీషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.