Posani vs Pawan Kalyan : వెరైటీగా స్పందించిన నాగబాబు..!
పోసాని, పేర్ని నానికి నాగబాబు ఇచ్చిన కౌంటర్లు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. పవన్‌కు మద్దతిస్తూ నాగబాబు వేసిన సెటైర్లు మైంక్ బ్లాంక్ చేస్తున్నాయి.;
పోసాని, పేర్ని నానికి నాగబాబు ఇచ్చిన కౌంటర్లు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. పవన్‌కు మద్దతిస్తూ నాగబాబు వేసిన సెటైర్లు మైంక్ బ్లాంక్ చేస్తున్నాయి. ఇన్‌స్టాలో 'ఆస్క్ మీ' అంటూ కొన్ని క్వశ్చన్స్‌కు ఆన్సర్ చేశారు. ఇందులో ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా స్పందించారు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా తిన్నగా సమాధానం ఇవ్వలేదు. ప్రతి ఆన్సర్.. ప్రత్యర్ధులను కొట్టినట్టే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్లు, మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు, పోసాని వ్యాఖ్యలపై మీమ్స్ జతచేసి ఆన్సర్స్ ఇచ్చారు నాగబాబు.
♦మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారా అనే.. నాకు ఇంట్రెస్ట్ పోయింది అనే మీమ్‌తో ఆన్సర్ ఇచ్చారు నాగబాబు.
♦ పవన్ కల్యాణ్ మ్యాటర్ మాట్లాడాలంటూ ఓ అభిమాని అడగంగానే.. గతంలో పవన్ గురించి పోసాని మాట్లాడిన వీడియో పోస్ట్ చేశారు. పవన్ నెంబర్‌వన్ హీరో అంటూ ఎత్తేస్తున్న వీడియో షేర్ చేశారు.
♦మరో నెటిజన్ ఏపీలో మూవీ టికెట్స్ రగడ గురించి మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు. అంతే.. వెంటనే విక్రమార్కుడు సినిమాలో సీన్‌ను పోస్ట్ చేశారు. ప్రభుత్వం టికెట్లు అమ్మితే ఎలా ఉంటుందన్నది సెటైరికల్‌గా చూపించారు.
♦ పోసాని చేసిన కామెంట్స్ గురించి ఒక్క మాట చెప్పండంటూ నాగబాబును ఓ నెటిజన్ అడగ్గానే.. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ డైలాగ్ పోస్ట్ చేశారు.
♦ ఇంత సీరియస్‌గా ఇన్‌స్టాలో చర్చ జరుగుతుంటే.. మీరు ఏ బ్రాండ్ తాగుతారంటూ ఓ నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు. ఇందులో కూడా నాగబాబు టైమింగ్ మిస్ అవ్వలేదు. జగన్ ప్రభుత్వంపై సెటర్ వేశారు. ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, గెలాక్సీ, బూమ్ బూమ్ ఫొటోలు పోస్ట్ చేశారు.
♦ రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్‌లో పవన్ స్పీచ్‌పై మీ స్పందన ఏమిటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సైతం.. కింగ్ మూవీలో సీన్‌ను పోస్ట్ చేశారు నాగబాబు.
♦ ఇక నాని గురించి చెప్పండి ప్రశ్న వేయగానే.. గుండెల్లో గోదావరి సినిమాలో మోహన్‌బాబు డైలాగ్‌ను పోస్ట్ చేశారు. ఆ నటనకు ఉన్న అవార్డులన్నీ ఇవ్వాలన్న డైలాగ్‌ను జత చేశారు.
ఓవరాల్‌గా దేనికీ డైరెక్టుగా సమాధానం చెప్పకుండా.. మీమ్స్, వీడియోలతో అటు జగన్ ప్రభుత్వంపైనా, మంత్రులపైనా, పోసానిపైనా కామెంట్ చేశారు.