Nagababu: 'అక్కడ అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు'
Nagababu: ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభపై జనసేన నేత, సీనీ నటుడు నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు;
Nagababu: ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభపై జనసేన నేత, సీనీ నటుడు నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు.. ఆ సభలో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.. ఆ మహానటులందరికీ నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణ సభ అద్భుతంగా జరిగిందని.. ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నా అన్నారు.. అయితే, దీనికి కొనసాగింపుగా ఆ సభలో అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారన్నారు.. నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.. ఆయన ఈ వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశిస్తూ చేశారా.. లేక బీజేపీని కూడా అందులో జత కలిపారా అని చర్చించుకుంటున్నారు.
ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺