NAGABAU: పదవుల మీద ఆశ లేదు కానీ: నాగబాబు
మంత్రి పదవిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు;
తనకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. "నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు… జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.. మరోవైపు, జనసేన సభ్యత్వం ఏ కార్యాకర్త ఎక్కువగా చేస్తారో వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయి" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను ఏమని తిట్టాలో అర్ధం కావడం లేదన్నారు. వైసీపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
‘‘నేను ఉత్తరాంధ్రలోనే ఉంటాను. నెలలో ఐదు నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తాను. దామాషా ప్రకారం జనసేనకు నామినేటెడ్ పదవులు వస్తాయి. మరి కొద్దిరోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలను పార్టీలో చేర్చాలి’’ అని నాగబాబు తెలిపారు.