వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. 2020లో తూళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్‌ను మరియమ్మ దూషించింది. దీంతో సురేష్ అనుచరులు దాడి చేయడంతో ఆమె చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నారా లోకేష్‌ను మరియమ్మ కుమారుడు కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. మరియమ్మ మృతి కేసు వివరాలను తెలియజేశారు. దీంతో ఈ కేసులో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.