AP : నేటి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

Update: 2024-07-23 12:02 GMT

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేటి నుంచి 4 రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గ మహిళలతో ముఖాముఖి నిర్వహించి, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఓపెన్ చేయనున్నారు. భువనేశ్వరి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం గుడుపల్లె మండలం కమ్మగుట్టపల్లె చేరుకుని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం కంచిబందార్లపల్లెలోనూ గ్రామీణ మహిళలతో సమావేశమై వారి సాదకబాధకాలు తెలుసుకుంటారు. గుట్టపల్లె, కోటపల్లె గ్రామాలలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాత్రికి పీఈఎస్‌ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారు. 24న ఉదయం కుప్పంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

Tags:    

Similar News