Nara Lokesh: చంద్రబాబు ఇంట భావోద్వేగ క్షణాలు
యువగళం కోసం లోకేశ్ సమాయత్తం; ఏడాది పాటూ యాత్రకే అంకితం; కుటుంబానికి ఉద్వేగపూరిత వీడ్కోలు..;
తేదేపా ముఖ్య కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర కోసం లోకేశ్ ఈ రోజే ప్రయాణమయ్యారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
ఏడాది పాటు సాగనున్న ఈ సుదీర్ఘ పాదయాత్రలో లోకేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 120 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించనున్నారు. ఈ మేరకు తన పాదయాత్ర నిర్విఘ్నంగా సాగాలని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేశ్ కు కుటుంబం భారీ హృదయాలతో వీడ్కోలు పలికింది. బ్రహ్మణి ఆరతి ఇచ్చి భర్తను సాగనంపగా, తనయుడు దేవాన్ష్ తండ్రిని హత్తుకుని వదలని వైనం కుటుంబ సభ్యులతో పాటూ కార్యకర్తలనూ భావోద్వేగానికి గురిచేసింది.