Nara Lokesh : అధికార పార్టీ అరాచకానికి అనకాలవీధి ఘటన పరాకాష్ట : నారా లోకేష్
Nara Lokesh : అధికార పార్టీ అరాచకానికి కర్నూలు జిల్లా వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.;
Nara Lokesh : అధికార పార్టీ అరాచకానికి కర్నూలు జిల్లా వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేత సమీర్‌రెడ్డి వీధికి అడ్డంగా గోడ కట్టడమే కాకుండా అడ్డుకున్న స్థానికులపై దాడి చేయడం దారణమన్నారు. మహిళలు, పిల్లలను చూడకుండా సీసాలు, రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల రాక్షస ప్రవృత్తికి నిదర్శనమని ఆరోపించారు. సినిమాల్లో విలన్ల తరహాలో వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దౌర్భాగ్యమని లోకేష్ అన్నారు.
నిన్న వెల్దుర్తి అనకాల వీధిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వీధిలో రహదారి విషయంలో కాలనీవాసులకు, వైసీపీ నేత సమీర్‌రెడ్డి మధ్య ఘర్షణ తలెత్తింది. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం సరికాదని స్థానికులు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన సమీర్‌రెడ్డి, ఆయన వర్గీయులు.. కాలనీవాసులపై రాళ్లతో దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అయితే దాడి చేసిన సమీర్‌రెడ్డి, వైసీపీ వర్గీయులను వదిలేసి కాలనీవాసులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వెల్దుర్తి అనకాలవీధి వివాదం మరింత ముదిరింది.