జగన్ ఇంతలా దిగజారుతారనుకోలేదు... జనం తిరగబడే రోజు దగ్గరపడింది : లోకేష్
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ దాడిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.;
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ దాడిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. దీనిని వైసీపీ గుండాల దాడిగా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపైకి గుండాలను పంపించే అంతటికి జగన్ దిగజారుతారనుకోలేని అన్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులను చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు లోకేష్. తాడేపల్లి ఇంటి నుంచి చంద్రబాబు ఇల్లు ఎంత దూరమో, చంద్రబాబు ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరం అని జగన్ గుర్తించుకోవాలన్నారు. జగన్ హామీలు గాలీమూటల్లా తేలిపోతుండడంతో జనం తిరగబడే రోజు దగ్గరపడిందని గ్రహించే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై వైఎస్‌ఆర్ ఎపుడూ ఇలా ప్రవర్తించలేదని, జగన్ తీరు చూసి వైఎస్‌ఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందన్నారు.