Yuvagalam: చంద్రగిరి నియోజకవర్గంలో యువగళం జోష్‌

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.;

Update: 2023-03-02 12:08 GMT

Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. యువ నేత ఎక్కడికి వెళ్లిన ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. వారి సమస్యలు లోకేష్‌కు చెప్పుకుంటున్నారు. ఇక అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. 32వ రోజు పాదయాత్రలో భాగంగా దామలచెరువులో ముస్లిం పెద్దలతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. వైసీపీ పాలనలో ముస్లీం, మైనారిటీలు పడుతున్న కష్టాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లీం, మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పారు. ఇక భోజన విరామం అనంతరం కొండేపల్లి క్రాస్‌ వద్ద రైతులతో భేటీ అయ్యారు. రైతులకు జగన్ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న జగన్‌ను.. ఇంటికి పంపేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.ఇక కాసేపట్లో మొగరాల గ్రామస్తులతో లోకేష్‌ భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు పుంగనూరు నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ఎంట్రీ అవుతుంది. 6గంటల 15నిమిషాలకు పులిచర్ల మండలం కొమ్మిరెడ్డిగారి పల్లి విడిది కేంద్రంలో లోకేష్‌ బస చేస్తారు.

Tags:    

Similar News