బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయని, 9 ఏళ్లుగా తన కంపెనీ, ఇల్లు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నా.. ఇప్పుడున్న రోడ్ల సమస్యలకు అక్కడ ఉండాలనిపించడం లేదంటూ బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక బెంగళూరులో ఉండకూడదని డిసైడ్ అయ్యామని ఆ పోస్టులో పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు కూడా ఆఫీసుకు రావాలంటే గంటన్నర సమయం పడుతోందన్నారు. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని, గడిచిన ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఈ పోస్ట్ చేసిన కాసేపటికే బ్రిటన్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ స్పందించారు. " హాయ్ రాజేష్ మీ కంపెనీని విశాఖకు తెచ్చుకునేందుకు నేను ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. దేశంలో ఉన్న అత్యుత్తమ క్లీన్ సిటీస్‌లో విశాఖప కూడా ఒకటి. ప్రస్తుతం అక్కడ మౌలిక వసతులను మెరుగ్గా చేస్తున్నామని, మహిళలకు కూడా నగరం చాలా సేఫ్ గా ఉంటుంది" అని చెప్పారు. తమ అభిప్రాయమేంటో తనకు డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరారు. దీంతో రాజేష్ చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టెక్ సిటీగా పేరొందిన బెంగళూరులో ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడి రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక 'భాగస్వామ్య సదస్సు - 2025'కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్ - యూకే బిజినెస్ ఫోరం' రోడ్‌షోలో లోకేశ్ పాల్గొంటున్నారు.