Nara Lokesh : ప్రధాని మోదీతో నారా లోకేశ్ భేటీ

Update: 2025-09-05 15:30 GMT

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేశ్..యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని మోదీకి అందజేశారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా లోకేశ్ కలవనున్నారు. గత మే 17న లోకేశ్ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లతో కలిసి మోదీని కలిశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన మరోసారి ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News