అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గీత దాటిందని మండిపడ్డారు. ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్‌లు కలిసి వచ్చినా భారత దేశంపై గడ్డిపరకను కూడా పీకలేరని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ అమరావతి నమో నమః అంటూ తన స్పీచ్‌ను మొదలు పెట్టారు. గతంలో వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారన్నారు. మరోవైపు అమరావతి రైతులను గత ప్రభుత్వం వేధించిందని ధ్వజమెత్తారు. జై అమరాతి అన్న రైతులను హింసించారు అని ఆరోపించారు. ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతి పునఃప్రారంభ సభా వేదికపై పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ప్రస్తావించారు. వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మన ప్రధాని మోదీ అన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మ తిరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ముందుగా పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్న లోకేష్ జై అమరావతి అన్నందుకు గతంలో తిరగలేని పరిస్థితి ఉందదని గుర్తు చేశారు.