అంతిమ విజయం భూములు త్యాగం చేసిన అమరావతి రైతులదే : లోకేష్
ఉద్యమకారులందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు.;
అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భంగా ఉద్యమకారులందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు, అవమానాలు పెట్టినా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అని గర్జిస్తున్న రైతులు, మహిళలు, యువత ఆదర్శంగా నిలిచారన్నారు. అమరావతిపై సీఎం జగన్ రెడ్డిది కేవలం విష ప్రచారమే తప్ప విషయం లేదని తేలిపోయిందని..అంతిమ విజయం రాష్ట్ర ప్రజలందరి కోసం భూములు త్యాగం చేసిన రైతులదేనని లోకేష్ ట్వీట్ చేశారు.