మేలో పరీక్షలన్నీ వాయిదా వేయాలని జగన్‌కు లేఖ రాసిన నారా లోకేష్
మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయడం లేదా రద్దు చేయాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.;
మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయడం లేదా రద్దు చేయాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. మూడు వారాల ఆందోళన, న్యాయ పోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో.. మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని లేదంటే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు లక్ష దాటడం లేదన్నారు నారా లోకేష్. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత ఉందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని పరీక్షలు వాయిదా వేయాలన్నారు. జూన్ మొదటి వారంలో మళ్లీ పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.