106వ రోజు యువగళం.. బనగానపల్లిలో లోకేష్‌కు బ్రహ్మరథం

లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నంద్యాల జిల్లాలో యువ నేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం

Update: 2023-05-21 02:15 GMT

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నంద్యాల జిల్లాలో యువ నేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎటు చూసిన జనప్రభంజనమే కన్పిస్తుంది. లోకేష్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు ప్రజలు. వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి సమస్యలను ఓపికగా వింటున్న యువనేత.. అండగా ఉంటానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

తాజాగా లోకేష్‌ పాదయాత్ర 106వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 13వందల 46 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. బనగానపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌.. ఇవాళ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ ఓనర్లు, కార్మికులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు లోకేష్‌. అనంతరం సాయంత్రం 4గంటలకు ఆముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఇక పాదయాత్రలో భాగంగా ఇవాళ ఆముదాలమెట్టలో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి చౌదరిదిన్నెలో రైతులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి కోవెలకుంట్లకు చేరుకుని ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులు, ఆర్యవైశ్యులతో విడివిడిగా భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఆ తరువాత కుందూనది బ్రిడ్జి వద్ద కుందూ పోరాట సమితి రైతులతో సమావేశం, బీమునిపాడు, కంపమళ్లమిట్టలో స్థానికులతో సమావేశం కానున్నారు. ఇక రాత్రికి లోకేష్‌ పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనంతరం రాత్రికి దొర్నిపాడు శివారు విడిది కేంద్రంలో లోకేష్‌ బస చేయనున్నారు.

Tags:    

Similar News