Nara Lokesh : వైసిపి బ్యాచ్ నోర్లు మూయించిన లోకేష్

Update: 2026-02-16 07:59 GMT

ఏపీలో మంత్రి నారా లోకేష్ ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. తనకు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టట్లేదు. అది ఎంత పెద్దది అయినా సరే దాని కోసం ఎంతమంది పోటీ పడుతున్నా సరే సాధించి ఏపీకి తీసుకువస్తున్నారు. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఏపీకి తీసుకువస్తున్న నారా లోకేష్.. అందుకు తగ్గట్టే ఏపీలో విద్యను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా 2026-27 బడ్జెట్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతోంది. ఈ బడ్జెట్ రూపకల్పనలో నారా లోకేష్ ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారీ 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇందులో పోలవరం, అమరావతికి ఎక్కువగా కేటాయింపులు చేశారు. ఆ తర్వాత విద్య కోసం 11% అంటే 35 వేల కోట్ల వరకు కేటాయించారు.

ఇందులో 10,000 కోట్లు ప్రత్యేకంగా ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం కోసం వినియోగించబోతున్నారు. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక పథకానికి ఎంతగా కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని రోజుల క్రితం వైసీపీ బ్యాచ్ తల్లికి వందనం పథకాన్ని ఎంతగా ట్రోల్ చేసిందో చూశాం. నీకు 15 నాకు 15 అంటూ పేద పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని అవమానించేలా మాట్లాడారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎన్నడూ ఆ ట్రోల్స్ కు కుంగిపోలేదు. వారికి చెక్ పెడుతూ ఈ బడ్జెట్ లో తల్లికి వందనం పథకం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

త్వరలోనే ఆ డబ్బులు తల్లుల ఖాతాల్లో పడబోతున్నాయి. ఈసారి బడ్జెట్ లో 52,000 కోట్లు నేరుగా సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లో పడబోతున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ప్రజల ఖాతాలో పడటం అంటే ప్రభుత్వం మీద భారమే.. అయినా సరే కూటమి వెనకడుగు వేయట్లేదు. కొంత రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ఆపొద్దు అనే ఉద్దేశంతోటే కూటమి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీ బడ్జెట్ లో ఈ రెవెన్యూ లోటును పూడ్చడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్లే ఈ రెవెన్యూ లోటు ఇంతగా ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News