NIA : మావోయిస్టు ఆర్కే ఇంట్లో ఎన్ఐఏ సోదాలు..
NIA : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూర పాడులో సోదాలు నిర్వహించారు ఎన్ ఐ ఏ అధికారులు.;
NIA : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అలకూర పాడులో సోదాలు నిర్వహించారు ఎన్ ఐ ఏ అధికారులు. దివంగత మావోయిస్ట్ నేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదాలు జరిపారు.. స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారుల సమక్షంలో శిరీష ఇంటి తాళాలు పగలగొట్టి తనిఖీలు చేశారు.
ఎన్ ఐఏ అధికారులకు అందిన కీలక సమాచారంతోనే ఈ తనిఖీలు జరిపినట్లు సమాచారం.. అయితే అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఆర్కే భార్య శిరీష గ్రామంలో లేరని, ప్రస్తుతం అమె విజయవాడలో ఉందని గ్రామస్తులు తెలిపారు.. జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారులు శిరీష ఇంటి చుట్టూ అణువణువు సోదా చేశారు...