AP: అమల్లోకి నూతన మోటారు వాహనాల చట్టం

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా.. ఏ ఉల్లంఘనకు ఎంత విధిస్తారంటే;

Update: 2025-03-03 04:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చింది. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1,000 జరిమానా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ. 1000 ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడితే రూ.10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేల జరిమానా విధించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిమానాలను అమలు చేస్తారు. బైకు నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్‌ పెట్టుకోవాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలా మంది అవేమీ పాటించకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. దీంతో జరిమానాలను పెంచారు.

ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా?

హెల్మెట్ లేకుండా వాహనం డిపితే: రూ.1,000

సీట్ బెల్ట్ లేకుండా నడిపితే: రూ.1,000

మద్యం తాగి వాహనం నడిపితే: రూ.10,000 (లైసెన్స్ రద్దు )

మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే: రూ.25,000, మూడేళ్ల జైలు శిక్ష

మైనర్ వాహనం నడపడానికి పెద్దలు అనుమతిస్తే: రూ.1,000, మూడు నెలల వరకు జైలు శిక్ష

డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: రూ.5,000 జరిమానా, వాహనం స్వాధీనం

కాలుష్య ధ్రువీకరణ పత్రం లేకపోతే: రూ.1,500

ఇన్సురెన్స్ లేకపోతే: రూ.2,000, రెండోసారి పట్టుబడితే: రూ.4,000

రిజిస్ట్రేషన్ రెన్యూవల్ లేకపోతే: రూ.2,000, రెండోసారి పట్టుబడితే రూ.5,000

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడితే: రూ.1,500, రెండోసారి పట్టుబడితే రూ.10,000

వేగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, సిగ్నల్ జంపింగ్ చేస్తే: రూ.1,000

రేసింగ్ లేదా స్టంట్‌లు చేస్తే: రూ.5,000, రెండోసారి పట్టుబడితే రూ.10,000

Tags:    

Similar News