అమరావతి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చెందుతోంది. ఒక ప్రాంతం లేదా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా రాజధాని ఉండాల్సిందే. ఒకప్పుడు పల్లెటూర్లు పట్టుకొమ్మలు అనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పల్లెటూర్ల ప్రజలు కూడా పట్నం వచ్చి అన్ని రకాల వసతులు ఉన్న సిటీలో బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. అందుకే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి శంకుస్థాపన చేశారు. రాజధాని అంటే ఒక రాత్రిలో అయ్యేది కాదు. ఇప్పుడు మొదలు పెడితే భవిష్యత్తులో దాని రిజల్ట్ కనిపిస్తుంది. దానికి బెస్ట్ ఉదాహరణ హైదరాబాద్. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు ఆలోచనలు మూల కారణం. ఒకప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టాయి. రేపటి రోజున అమరావతిని కూడా ఆ స్థాయిలో నిలబెట్టాలన్నదే ఆయన ఆశయం. బిల్ గేట్స్, వాజ్పేయి, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు మెచ్చిన చంద్రబాబు నాయుడు.. నేడు జగన్ లాంటి వ్యక్తితో పోరాడాల్సి వస్తుంది. వాస్తవానికి అమరావతిని కట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు తో పాటు జగన్ పేరు చెప్పుకోవాల్సింది. కానీ ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అమరావతిని సర్వనాశనం చేసింది. జగన్ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా కట్టలేకపోయాడు.
ఒకవేళ జగన్ పాలనలో అమరావతిని పట్టించుకుంటే ఈపాటికి చాలా పనులు పూర్తయ్యేవి. కానీ జగన్ అరాచక పాలనను భరించలేక ప్రజలు అత్యంత ఘోరంగా ఓడించారు. మొన్న సెప్టెంబర్ 10న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీ కట్టాలంటే కనీసం 9 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. కానీ అమరావతిని మాత్రం ఐదేళ్లలో పూర్తి చేయాలంటాడు. ఒక్క మెడికల్ కాలేజీ కట్టడానికి అంత సమయం పడితే.. ఒక రాజధాని కట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది.. ఆ మాత్రం తెలియకుండానే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలను వైసిపి చేస్తోంది. అమరావతిని కదిలించడానికి వైసిపి చేయని కుట్రలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీరికి తోడుగా ఏపీ ప్రజలు అండగా ఉన్నంతకాలం అమరావతిలో ఒక్క ఇటుక కూడా కదిలించలేరని నిరూపితమైంది. అందుకే జగన్ ఎత్తుగడలను నేలకేసి కొట్టి చంద్రబాబు నాయుడుకు జై కొట్టారు. ఇప్పుడు కూటమిపాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మొన్నటికి మొన్న మలేషియా నుండి గణపతి రావు అనే వ్యక్తి అమరావతిలో 6000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ కంపెనీలు కూడా అమరావతికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. లింగాయపాలెంలో 200 రూములతో ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మితమవుతోంది. అమరావతి భవిష్యత్తులో అందనంత ఎత్తులో ఉంటుందనడానికి వస్తున్న ఈ పెట్టుబడులే నిదర్శనం. ఈ అభివృద్ధిని చూసి అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని వైసీపీకి అర్థమయింది.
అందుకే మొన్న అమరావతిలో జరిగిన కాన్ క్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని దానికి తాము కూడా సహకరిస్తామని ప్లేటు మార్చేశాడు. జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూసిన తర్వాత అమరావతిని అడ్డుకోవడం ఎవరివల్ల కాదని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అమరావతిని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాయి. వాటి ఫలాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు తరాలకు కచ్చితంగా అందుతాయి. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఈ అభివృద్ధి ఇలాగే పరుగులు పెట్టాలనే ఉద్దేశంతోటే చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ.. ఎవరు అడ్డొచ్చినా ఊరుకోవట్లేదు. సొంత ఎమ్మెల్యేలను కూడా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ తప్పులు జరగకుండా వార్నింగ్ లు ఇస్తున్నారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే. విద్య, వైద్యం, టెక్నాలజీ వీటన్నింటినీ సమపాళ్లలో ప్రజలకు అందించేందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయి కాబట్టే ఆయన పాలనకు ప్రజల నుండి ఎలాంటి నిరసనలు రావట్లేదు.