మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మ. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్‌లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఏ-1గా ఉన్నారు. అయితే, ఈ కేసులో జయసుధకు కోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. పోలీసు విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.