బ్రేకింగ్.. శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడి విగ్రహాలు ధ్వంసం
టీడీపీ వ్యస్థాపకులు ఎన్టీఆర్, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం చేశారు.;
శ్రీకాకుళం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న టీడీపీ వ్యస్థాపకులు ఎన్టీఆర్, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు పోలీసులు.
దేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైసీపీ దుష్టులే.. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేశారంటూ ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నిలబెట్టడం చేతగాని జగన్‌రెడ్డి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కూల్చి వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్, ఎర్రన్నాయుడి విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.