సీఎం చంద్రబాబుపై అక్రమ కేసు.. జగన్ పతనం అక్కడే మొదలు..

Update: 2026-01-15 04:45 GMT

సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతి కేసులు లేని నిష్కలమైన రాజకీయ నాయకుడు అనే విషయం అందరికీ తెలిసిందే. జగన్ ఎన్నో అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైల్లోకి వెళ్ళాడు. తాను జైల్లోకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని కూడా అక్రమ కేసులో జైల్లోకి ఒక్కసారైనా పంపాలని అనుకున్నాడు. అందుకే ఎలాంటి సాక్షాలు లేకపోయినా సరే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి అంటూ ఒకటి బయటకు తీశారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు జగన్. దాన్ని యావత్ తెలుగు ప్రజలు మొత్తం వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి వస్తుంటే రోడ్డుమీద కూర్చోబెట్టారు. అయినా సరే పవన్ వెనకడుగు వేయకుండా జైల్లో చంద్రబాబు నాయుడుని కలిసి పొత్తుపై ప్రకటన చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వమని శపథం చేశారు. ఒక రకంగా జగన్ పతనం ఇక్కడే మొదలైంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కావాలని దోమలు, నల్లులు వచ్చేలా చేశారు. కనీసం ఫ్యాన్ కూడా లేని గదిలో ఉంచి చాలా ఇబ్బందులు పెట్టారు. జగన్ అరాచకాలు చూసిన ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. ప్రజలు అఖండమైన మెజార్టీతో కూటమిని గెలిపించారు. వైసిపి పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి గట్టి బుద్ధి చెప్పారు.

ఒకరకంగా ఆ కేసు వల్లే ఒత్తుపై ప్రకటన త్వరగా వచ్చింది. అది ఏపీ రాజకీయాలనే మలుపు తిప్పింది. వైసిపి వ్యతిరేక ఓటు చీలిపోకుండా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయడంతో.. వైసిపికి దిమ్మతిరిగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసులు చంద్రబాబు నాయుడుకు ఏసిబి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో అవినీతి జరిగినట్టు ఎలాంటి సాక్షాలు లేవని తెలిపింది. చంద్రబాబు నాయుడు ఎంత నిజాయితీ పరుడు అనేది మరోసారి బయటపడింది.

Tags:    

Similar News