పోరంకిలో ఘనంగా NTR శత జయంతి ఉత్సవాలు
వంగవీటి రాధా, బోజేడ్ల కల్యాణ్ యాత్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు;
విజయవాడ పోరంకిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వంగవీటి రాధా, బోజేడ్ల కల్యాణ్ యాత్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డికేఆర్ గ్రీన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌లో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదని.. ఓ శక్తి అని నేతలు, మహిళలు అన్నారు. తెలుగువాడి సత్తా ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.