PADMA AWARDS: తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు
తెలుగు తేజాలకు పద్మ పురస్కారాలు
2026గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌ను దిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. ఏపీ, తెలంగాణకు చెందిన 13 మందికి పద్మ పురస్కారాలు వరించాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులు) ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 45 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఇద్దరికి మొత్తం నలుగురు తెలుగు వాళ్లకు పద్మశ్రీ వరించింది. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ(ఏపీ), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ(ఏపీ), విజయ్ ఆనంద్‌కు పద్మశ్రీ(తెలంగాణ), గడ్డమానుగు చంద్రమౌళి పద్మశ్రీ(తెలంగాణ) అవార్డులు దక్కాయి.
వీరు పద్మ విభూషణులు
కేంద్ర ప్రభుత్వం 131 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, వి. ఎస్. అచ్యుతానందన్లకు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. కె. టి. థామస్, ఎన్. రాజన్, పి. నారాయణన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. పురస్కార గ్రహీతలకు ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు.
అచ్యుతానందన్‌కు పద్మ విభూషణ్
కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌కు పద్మవిభూషణ్, మలయాళ దిగ్గజ నటుడు మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది. గతేడాదితో పోల్చితే ఈసారి పద్మశ్రీ అవార్డులను కేంద్రం సగానికిపైగా తగ్గించింది. అవార్డు విజేతల్లో అత్యంత ప్రముఖులతో పాటు అంత్యంత మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు సహా వివిధ ప్రాంతాలకు చెందినవారు కూడా ఉండటం గమనార్హం. ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి కల్పన రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ప్రకటించారు.
ఐదుగురికి పద్మవిభూషణ్
2026 రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్టులు దక్కాయి. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో కళల విభాగంలో ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం) (మహారాష్ట్ర), ప్రజా వ్యవహారాల్లో కే.టీ. థామస్ (కేరళ), కళల విభాగంలో ఎన్. రాజమ్ (ఉత్తరప్రదేశ్), సాహిత్యం & విద్య లో పి.నారాయణన్ (కేరళ), ప్రజా వ్యవహారాల విభాగంలో వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) (కేరళ) ఉన్నారు.