Tadepalli : ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి.. పట్టాభి మాటల దాడి

Update: 2024-10-17 10:15 GMT

ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తరువాత, ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారంటూ సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత పట్టాభి. ప్రపంచంలో ఎవరూ ఇలా ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోరని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని వృథా చేసి.. రూ.12.85 కోట్లతో కొంప చుట్టూ ఇనుప కంచె కట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ సర్కారు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని మీడియా సమావేశంలో పట్టాభి ఆరోపించారు.

Tags:    

Similar News