ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులను సత్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో.. రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతోపాటు సాంత్వన కలిగిస్తుందని తెలిపారు.