PAWAN: స్మగ్లింగ్‌ స్వచ్ఛందంగా ఆపకపోతే..ఎలాంటి చర్యలకైనా వెనుకాడం

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హెచ్చరిక

Update: 2025-11-08 15:15 GMT

ఆప­రే­ష­న్‌ కగా­ర్‌­ను అమలు చే­స్తు­న్న ఈ దే­శం­లో.. ఎర్ర చం­ద­నం స్మ­గ­ర్ల ఆట కట్టిం­చ­డం పె­ద్ద లె­క్క కా­ద­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ హె­చ్చ­రిం­చా­రు. స్మ­గ్లిం­గ్‌ స్వ­చ్ఛం­దం­గా ఆప­క­పో­తే.. ఎలాం­టి చర్య­ల­కై­నా వె­ను­కా­డ­బో­మ­ని గట్టి వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. ఎర్ర­చం­ద­నం స్మ­గ్ల­ర్ల­పై ఉక్కు­పా­దం మో­పు­తా­మ­ని అన్నా­రు. తి­రు­ప­తి జి­ల్లా కలె­క్ట­రే­ట్‌­లో అటవీ అధి­కా­రు­ల­తో సమీ­క్ష అనం­త­రం ఆయన మీ­డి­యా­తో మా­ట్లా­డా­రు. ‘‘ఎర్ర­చం­ద­నం చె­ట్టు వె­నుక ఆధ్యా­త్మిక చరి­త్ర ఉంది. వేం­క­టే­శ్వ­ర­స్వా­మి గాయం నుం­చి పు­ట్టిం­ద­ని పు­రా­ణాల ద్వా­రా తె­లు­స్తోం­ది. ఎర్ర­చం­ద­నం అక్రమ రవా­ణా­పై జి­ల్లాల ఎస్పీ­ల­తో సమీ­క్ష ని­ర్వ­హిం­చాం. శే­షా­చ­లం అడ­వు­ల్లో స్మ­గ్ల­ర్లు దా­దా­పు 2లక్షల ఎర్ర­చం­ద­నం చె­ట్లు కొ­ట్టే­సి ఉం­టా­ర­ని అధి­కా­రుల అం­చ­నా. అక్రమ రవా­ణా­ను అడ్డు­కు­నేం­దు­కు టా­స్క్‌­ఫో­ర్స్‌­ను ఏర్పా­టు చే­శాం. స్మ­గ్లిం­గ్‌­ను అరి­క­ట్టేం­దు­కు ఏపీ, కర్ణా­టక మధ్య ఒప్పం­దం చే­సు­కుం­దా­మ­ని కర్ణా­టక సీఎం సి­ద్ద­రా­మ­య్య­ను కో­రాం. ఇప్ప­టి­కే ఎర్ర­చం­ద­నం స్మ­గ్లిం­గ్స్‌ చే­స్తు­న్న నలు­గు­రు కిం­గ్‌ పి­న్స్‌­ను గు­ర్తిం­చాం. వా­రి­ని పట్టు­కు­నేం­దు­కు చర్య­లు చే­ప­ట్టాం.” అని తె­లి­పా­రు.

8 గో­డౌ­న్ల­లో ఉన్న ఎర్ర­చం­ద­నం లా­ట్ల వి­వ­రా­ల­ను డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. ఎ, బి. సీ, నాన్ గ్రే­డ్ ల వా­రీ­గా దుం­గల వి­వ­రా­ల­పై ఆరా తీ­శా­రు. ప్ర­తి గో­డౌ­న్ లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ రి­కా­ర్డు­లు పరి­శీ­లిం­చా­రు. ప్ర­తి ఎర్ర చం­ద­నం దుం­గ­కి ప్ర­త్యేక బార్ కో­డిం­గ్, లైవ్ ట్రా­కిం­గ్ వ్య­వ­స్థ­లు ఏర్పా­టు చే­యా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. పట్టు­బ­డిన దగ్గర నుం­చి అమ్ము­డు­పో­యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ­కూ­డ­ద­ని అట­వీ­శాఖ అధి­కా­రు­ల­ను పవన్ కల్యా­ణ్ ఆదే­శిం­చా­రు. అడ­వి­లో నా­లు­గు కి­లో­మీ­ట­ర్లు పైగా ప్ర­యా­ణిం­చిన ఆయన… రెం­డు కి­లో­మీ­ట­ర్ల మేర కా­లి­న­డ­కన ప్ర­తి చె­ట్టు­ను పరి­శీ­లిం­చా­రు. ఎర్ర­చం­ద­నం, అం­కు­డు, తె­ల్ల­మ­ద్ది, వె­దు­రు­తో పాటు శే­షా­చ­లం­లో మా­త్ర­మే కన­బ­డే అరు­దైన మొ­క్క­ల­ను పరి­శీ­లిం­చిన పవన్ కల్యా­ణ్…. అధి­కా­రుల నుం­చి వి­వ­రా­లు తె­లు­సు­కు­న్నా­రు.



Tags:    

Similar News