ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నామని తెలిపారు. వారం రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. గ్రామసభల్లో తీసుకున్న అర్జీల పరి ష్కారానికి, తీర్మానాల అమలుకు, దాదాపు 4500 కోట్లతో 30 వేల పనులను మొదలుపె ట్టేందుకు పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు భూమి పూజ కార్య క్రమాలు చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొం టారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఎన్ఆర్ ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్, పంచా యతీరాజ్ చీఫ్ ఇంజనీర్ పాల్గొన్నారు.