Janasena Party: మచిలీపట్నం జనసేన లోక్‌సభ అభ్యర్థి ప్రకటన
వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించిన అధ్యక్షుడు పవన్ కల్యాణ్;
మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని జనసేన ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికారికంగా వెల్లడించినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. తర్వలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ పేర్కొంది.
తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని, ఇందుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయిన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ వెల్లడించింది.
వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. గత కొద్దిరోజుల క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. మరోసారి మచిలీపట్నం ఎంపీగా జనసేన పార్టీ నుంచి ఆయన పోటీలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల జనసేన అధినేత ప్రకటించిన లిస్టులో మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిని ప్రకటించక పోవటంతోపాటు, ఆ స్థానానికి బాలశౌరి కాకుండా మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో బాలశౌరి పొలిటికల్ ప్యూచర్ ఏమిటనే చర్చ సాగింది. తాజాగా బాలశౌరికి మచిలీపట్నం లోక్ సభ సీటును కన్ఫామ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవటంతో సస్పెన్షన్ కు తెరదించినట్లయింది.