సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. "మతానికి, ధర్మానికి భంగం వాటిళ్లినా అందరూ ఒకే విధంగా స్పందించేలా లౌకిక వాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ లో భాగంగా అవిశ్వాసాలను ప్రేరేపించే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ వారాహి డిక్లరేషన్ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. ఏటా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు నిధులు కేటాయించాలి. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల తయారీలో ఉపయోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆలయా ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్య, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి." అంటూ అభిమానుల హర్షాతిరేకాల మధ్య పవన్ డిక్లరేషన్ ఇచ్చారు.