AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తోంది. వెలగపూడిలో మంత్రి వర్గ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరుతారు. ఇటీవల పవన్ పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేయడం, అదేసమయంలో ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్ట్ భూములను నిన్న పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ కి వెళ్ళడం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.