Janasena Formation Day Meet: జనసేన ఆవిర్భావ సభ.. విజయవంతం చేయాలంటూ జనసేనాని పిలుపు..

Janasena Formation Day Meet: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు

Update: 2022-03-13 15:30 GMT

Pawan Kalyan (tv5news.in)

Janasena Formation Day Meet: ఆవిర్భావ సభకు జనసేన సిద్ధమైంది.. సోమవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు.. ఆవిర్భావ సభకు వేల సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.. జనసేన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్, పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..

సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు.. అయితే, ఆవిర్భావ దినోత్సవంగా దీనిని తాము చూడటం లేదని జనసైన్యం అంటోంది.. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయబోతోందని అంటోంది.. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏమేం జరిగాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే అంశాలపై సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడతారని తెలుస్తోంది. 

జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులతోపాటు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. గ్రామాల నుంచి క్షేమంగా సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. పవన్‌ కల్యాణ్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియో సందేశాన్ని ఆ పార్టీ ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా.. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తమకు ఉందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్.

సోమవారం తాము నిర్వహించే ఆవిర్భావ సభకు అధికారులు ఇబ్బందులు కల్గించవద్దని సూచించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ తమను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలకు జనసైనికులు ఎలా సిద్దం కావాలో పవన్ కల్యాణ్ సోమవారం దిశా నిర్దేశం చేస్తారన్నారు.

జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని..ఈ సభలో జనసైనికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సురక్షితంగా సభకు రావాలన్నారు. విజయవాడలో జనసేన కార్యకర్తలు, అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడం తీవ్ర దుమారం రేపింది..

హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులే దగ్గరుండి బ్యానర్లు తొలగించడం ఏంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. దీంతో పోలీసులు, నాదెండ్ల మనోహర్ మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. వారధిపై భారీగా పోల్‌ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జనసేన కట్టిన ఈ బ్యానర్లను బెజవాడ మున్సిపల్ సిబ్బంది తొలగించారు.. అనుమతి లేని కారణంగానే ఫ్లెక్సీలు తొలగించినట్లు మున్సిపల్ సిబ్బంది వివరణ ఇచ్చారు. అయితే, మున్సిపల్‌ సిబ్బంది తీరుపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు

Tags:    

Similar News