Mayapatnam : మాయపట్నం ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి .. పవన్ కల్యాణ్ ఆదేశాలు
ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి పెరగడం మూలంగా మాయపట్నం గ్రామం జలమయమైన విషయం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చిన వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్షించారు. అధికారులు అక్కడి పరిస్థితిని వివరించారు. మాయపట్నం వద్ద అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో అక్కడ ఇళ్ళు నీట మునిగాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రివర్యులు స్పందిస్తూ అక్కడి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఆహారం, పాలు, మంచి నీరు అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బందిని, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గతంలో అక్కడి తీరంలో చేప్పటిన రక్షణ చర్యల గురించి, నిర్మించిన రక్షణ గోడ, జియో ట్యూబ్ గురించి ఆరా తీశారు.