దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌పై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీవీ విషయంలో పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తారన్నారు. లాం అండ్, ఆర్డర్ హోం శాఖలు తన దగ్గర లేవని తెలిపారు. పోలీసుల తీరును సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత దృష్టికి తీసుకెళ్తానన్నారు పవన్. వివాదాస్పద కామెంట్స్ వ్యవహారంలో ఆర్జీవీకి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే, ఆయన విచారణకు రెండు సార్లు హాజరు కాలేదు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.