Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తిరుగులేని రికార్డ్.. ఒకేరోజు 13,326 గ్రామసభలు
ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణా భివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆశాఖలను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. ఆగస్టు 23న 'స్వర్ణ గ్రామ పంచాయతీ' పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు.
రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకే రోజు భారీ స్థాయిలో ప్రజల భాగ స్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో పవన్ కల్యాణ్ నివాసంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీ షియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి అందజేశారు.
గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ ఆనందాతిరేకాన్ని వ్యక్తం చేశారు. గ్రామ సభలు విజయవంతం చేయ డంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.