పిఠాపురంలోని ప్రముఖ పురుహూతికా ఆలయంలో రేపు భారీ ఎత్తున సామూహిక వరలక్ష్మీ వత్రాలు నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇందులో పాల్గొనే మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేయనున్నారు.
ఇందుకు సంబంధించి 12 వేల చీరలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆలయంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురంలో ఆడపడుచులకు డిప్యూటీ సీఎం కుటుంబం ఇస్తున్న వాయినంగా దీన్ని చెప్పుకుంటున్నారు.