CM Chandrababu : వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు : సీఎం చంద్రబాబు

Update: 2024-12-31 13:15 GMT

వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. యల్లమంద గ్రామస్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే తన తపన అని చెప్పారు. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తానని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగును చూడాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.

యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇళ్ళకు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి... శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీ కష్టాల్లో భాగం పంచుకోవడానికే వచ్చా. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే నా తపన. గత ఐదేళ్లు బయటకు పోలేని పరిస్థితి.. కనీసం నవ్వలేకపోయారు. ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్‌తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.

Tags:    

Similar News