తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం!

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2021-02-20 15:45 GMT

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 35 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉందని, ర్యాలీలకు పర్మిషన్ లేదని టీడీపీ వర్గీయుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్ ఆంక్షల మధ్య అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ వర్గీయులు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అటు అధికార పార్టీ ర్యాలీలకు మాత్రం పర్మిషన్ అవసరం లేదా అని టీడీపీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News