ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్- పాక్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అటు తిరుమల కొండపైన భద్రతను మరోసారి కట్టుదిట్టం చేశారు. భారీ బలగాలతో అణువణులు గాలింపు జరుపుతున్నారు. 130 మంది సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, విజిలెన్స్, బాంబ్, డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ బృందాలతో కొండపైన ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పరిసరాలు, మాడవీధులు, కాటేజీలు, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, క్యూకాంప్లెక్స్‌లు, బస్టాండ్ వంటి రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో తనిఖీలు చేస్తున్నారు.