Andhra Pradesh News : కడపలో టీడీపీ అదిరే స్కెచ్.. జగన్ కు భారీ షాక్..

Update: 2026-01-22 13:45 GMT

కడప రాజకీయాల్లో సంచలనాలు జరుగుతున్నాయి. కడప అంటేనే మొదటి నుంచి తమ కంచుకోట అని వైసీపీ చెప్పుకునేది. అలాంటి చోట కూటమి దుమ్ము లేపింది. గత 2024 ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ సీట్లు కూటమి ఖాతాలో పడ్డాయి. కేవలం మూడు సీట్లకే వైసీపీ పరిమితం అయిపోయింది. ఇప్పుడు కడప మీద సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కడపలో కూటమికి మంచి క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే వైసీపీ నేతలు జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీలో పనిచేసిన నాయకులకు ఎలాగూ గుర్తింపు లేదనే వాదనలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది నేతలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు.

వైసీపీ నేతలు ఎంతగా బుజ్జగించినా సరే వారెవరూ వినట్లేదు. తమకు గుర్తింపు లేని పార్టీలో ఉండబోమని చెబుతూ సైకిల్ ఎక్కుతున్నారు. పైగా మాజీ సీఎం జగన్ చేస్తున్న ప్రకటనలు పార్టీకి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకొస్తున్నాయని.. కార్యాకర్తలను జగన్ పట్టించుకోరు అని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పనిచేసిన వారికి అత్యధిక గుర్తింపు ఇచ్చే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే నడుస్తామని ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, అదే నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అనుచరుడు కూడా సైకిల్ ఎక్కేశారు.

అటు హెచ్ ఎల్ సీ మాజీ చైర్మన్, మాసనూరు చంద్ర వీర బ్రహ్మంగారి మఠం ఎంపీపీ వీరనారి రెడ్డి లాంటి వారు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇలా కడపలో వైసీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. త్వరలోనే వైసీపీని కింది స్థాయి కార్యకర్తలు పూర్తి స్థాయిలో వీడం ఖాయం అంటున్నారు టీడీపీ నేతలు.

Tags:    

Similar News