కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విధానంలో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ విధానంపై వైసీపీ ఎంత గగ్గోలు పెడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు అంటూ జగన్ ఓ కొత్త నాటకానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అసలే వైసిపి అక్రమాలు, కుంభకోణాలు మొత్తం బయటపడుతూ ఆ పార్టీ ఇమేజ్ సర్వనాశనం అవుతోంది. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొత్త నాటకం. అయితే పిపిపి విధానంపై గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు పీపీపీ విధానం చాలా మంచిది అని దాన్ని దేశమంతా అమలు చేయాలని వేసిన కమిటీలో అప్పటి, ప్రస్తుత వైసిపి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. 2024లో ఇచ్చిన ఈ నివేదికలో ఆయన సంతకం కూడా చేశారు. మరి ఆయన జగన్ ను అడగకుండా ఆ సంతకం పెట్టలేదు కదా. జగన్ పెట్టమంటేనే ఆయన పెట్టేశారు.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంటే మాత్రం ఓర్చుకోలేకపోతున్నారు. వైసిపి హయంలో పిల్లర్ల వరకే ఆగిపోయిన మెడికల్ కాలేజీలకు ఈ పిపిపి విధానం మంచిది కాదని.. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయి అంటూ రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మరి ఈ విధానం మంచిది కాకపోతే అప్పుడు గురుమూర్తి ఎందుకు సంతకం పెట్టారు. దీన్నిబట్టే వైసిపి ఈ విధానంపై డబుల్ గేమ్ ఆడుతోందనే విషయం అర్థమైపోతుంది. జగన్ కావాలనే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని విషయం కూడా ఇక్కడ అందరికీ అర్థం అయిపోతుంది.
వాస్తవానికి పిపిపి విధానం అనేది మెడికల్ కాలేజీలలో అమలు చేసినా సరే ప్రభుత్వ చేతుల్లోనే పూర్తి అధికారాలు ఉంటాయి. ఈ విధానం కేవలం మెడికల్ కాలేజీలను అత్యద్భుతంగా తీర్చిదిద్దడం కోసం మాత్రమే. ప్రభుత్వ మీద పూర్తిస్థాయి భారం పడకుండా వాటిని కార్పొరేట్ రేంజ్ లో డెవలప్ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆ విషయం వైసిపికి కూడా బాగా తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే దాని మీద బురద చల్లడమే జగన్ కు ఉన్న అతిపెద్ద లక్ష్యం కదా. అందుకే ఈ విధానం మంచిదే అని తెలిసినా సరే దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాలని చూస్తున్నారు. కానీ వాళ్లు ఎన్ని చేసినా సరే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే పిపిపి విధానం మీద ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు.