PRAKASHRAJ: నేను ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు
ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్... బెట్టింగ్ యాప్ కేసులో సుదీర్ఘ విచారణ.. 5 గంటల పాటు విచారించిన ఈడీ;
బెట్టింగ్ యాప్స్ కేసులో వదల బొమ్మాళీ అంటూ ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఫోకస్ చేసింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్‌పై సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఓ బెట్టింగ్ యాడ్ ప్రమోషన్లో ప్రకాష్‌రాజ్ నటించడంతో అతనిపైనా కేసు నమోదైంది. 10రోజులక్రితం నోటీసులు ఇవ్వడంతో ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ, రానా, ప్రకాష్‌రాజ్, మంచులక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఈడీ ముందు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరు డబ్బు సంపాదించాలని భావించవద్దని సూచించారు..
ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలు నమోదు చేసుకున్నారన్నారు.. మళ్ళీ విచారణకు ఈడీ అధికారులు పిలవలేదని వెల్లడించారు. కాగా.. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్. సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే, ఐదు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. తన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఈడీకి అందజేశారు ప్రకాష్‌రాజ్. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా ప్రకాష్‌రాజ్ లాభపడినట్లు చెబుతున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక.. మళ్లీ రెన్యూవల్ చేయలేదని.. మళ్లీ ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పుకొచ్చారు. తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను ఇప్పటికే ఈడీకి అందజేశానని ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. "జంగిల్ రమ్మీ"అనే యాప్ ద్వారా తాను మంచి ఆదాయం పొందినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఆయాప్‌తో తన కాంట్రాక్ట్ పూర్తయ్యాక మళ్లీ దీన్ని రెన్యూల్ చేయలేదని,ఇకపై ఎప్పుడూ ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయనని చెప్పారు.