ఆనందయ్య కంటి చుక్కల మందులో హాని కలిగించే పదార్ధం : ప్రభుత్వ తరపు న్యాయవాది

ఆనందయ్య కంటి చుక్కల మందులో హాని కలిగించే ఒక పదార్ధం ఉందంటూ కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది.;

Update: 2021-06-21 13:00 GMT

ఆనందయ్య కంటి చుక్కల మందులో హాని కలిగించే ఒక పదార్ధం ఉందంటూ కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న చుక్కల మందును ఐదు ల్యాబ్‌ల్లో పరీక్షించామని, ఆ ఫలితాల్లో ఆనందయ్య చుక్కల మందులో ఒక పదార్ధం హానికరంగా ఉన్నట్టు తేలిందని తెలిపారు. దీంతో ఆ ల్యాబ్‌ల నివేదికలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు. అటు పిటిషనర్ తరపు న్యాయవాది.. కంటి చుక్కల మందును ఆయుష్ రీసెర్చ్‌ సెంటర్‌లో టెస్ట్‌ చేయించాలని కోర్టును కోరారు. ఆనందయ్య మందు పంపిణీపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News