MEGASTAR: యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ఘన సత్కారం

లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారం ప్రధానం... కీర్తి మరింత పెరిగిందన్న పవన్ కల్యాణ్;

Update: 2025-03-20 04:30 GMT

బ్రిటన్ పార్లమెంట్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకిగానూ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పవన్ సుదీర్ఘ ట్వీట్

సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగారని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాననని.. తాను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని తెలిపారు.

" నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు." అని పవన్ అన్నారు. పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈనెల 19న యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పవన్ అన్నారు. 

Tags:    

Similar News