Rahul Jodo Yatra: రాహుల్ పాద యాత్రలో.. ఏపీ, తెలంగాణ నేతలు..

Rahul Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇవాళ 41వ రోజు చేగి గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర జోరుగా సాగుతుంది.

Update: 2022-10-19 08:51 GMT

Rahul Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇవాళ 41వ రోజు చేగి గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర జోరుగా సాగుతుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాహుల్ ముందుకు సాగారు. పాదయాత్రలో ఏపీ నాయకులతోపాటు.. తెలంగాణకు చెందిన నేతలు కూడా పాల్గొంటున్నారు.

ఇక రాహుల్‌ గాంధీకి ఆధోనిలో ఘనస్వాగతం లభించింది.ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జీ ధరించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నడిచారు.ఏపీలో సాగే పాదయాత్ర మొత్తం ఈ బ్యాడ్జీతోనే రాహుల్ కనిపించబోతున్నారు. దీంతో ఏపీ ప్రజలకు గెలిస్తే హోదా ఇస్తానన్న హామీని నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు.

ఇక ఉదయం 9.30 గంటలకు ఆదోని సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌స్‌ కాలేజ్‌ దగ్గర పాదయాత్రకు మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు.. అక్కడ కాంగ్రెస్‌ నేతలతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన రాహుల్ స్థానికులతో సమావేశం అయి ఏపీలో పాలన, రైతుల సమస్యలపై ముచ్చటించారు.రాష్ట్రంలో అమలు అవుతున్న పధకాలపై రాహుల్‌ కాంగ్రెస్‌ నేతలతో ప్రత్యేకంగా చర్చించారు. ఇక జిల్లా లోని వేరు శెనగ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు రాహుల్‌.

లంచ్‌ బ్రేక్‌ తరువాత తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర మొదలై ఆరేకల్‌ వరకు సాగనుంది. అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు. రాత్రి ఏడు గంటలకు బనవాసి గ్రామంలో 41వ రోజు పాదయాత్ర ముగియనుంది.భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.


ఏపీసీపీ చీఫ్‌ సాకే శైలజానాధ్‌ తో పాటు కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ నేతలు,పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న పొలాల్లో దిగి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags:    

Similar News