కాకినాడ రామారావుపేటలోని సుబ్బయ్య హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అమ్మకానికి ఉంచిన కారప్పొడి, వడియాలు, పచ్చళ్లు ప్యాకెట్లపై తేదీలు లేకపోవడాన్ని గుర్తించారు. వాటిలో కొన్ని ప్యాకెట్లను సీజ్ చేసి శాంపిల్స్ సేకరించారు. ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తెలిపారు. ప్యాకెట్లపై ఎలాంటి తేదీలు లేవని, గడువు ముగిసిన తర్వాత కూడా అమ్ముతున్నట్టు ఓ వ్యక్తి వాట్సాప్‌లో ఫొటోలతో ఫిర్యాదు కంప్లయింట్ చేశాడు. దాడుల్లో 9 రకాల పొడులు, వడియాలు సీజ్ చేశారు. సెక్షన్ 58 కింద కేసు నమోదు చేశారు. మరో రెండు సుబ్బయ్య హోటళ్లలో కూడా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. తీరు మారకపోతే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.