Raja Singh : మన జోలికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొందాం.. రాజాసింగ్ పిలుపు

Update: 2024-09-26 06:45 GMT

హిందువుల గుడులు, గోపురాల జోలికి ఎవరైనా వస్తే హిందువులంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇతర మతస్తులు పేర్లు మార్చుకుని గుడుల్లో ఉద్యోగాలు పొంది ఉంటే వారిని గుర్తించి తొలగించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.

తిరుమలను అపవిత్రం చేసిన వ్యక్తి ఏ మొహం పెట్టుకుని మళ్లీ తిరుమల దర్శనానికి వస్తున్నాడని రాజాసింగ్ నిలదీశారు. మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. మొత్తం హిందూ సమాజం వ్యతిరేకిస్తున్నా ఇంకా గొడవలు సృష్టించడానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News